![]() |
![]() |
.webp)
సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. కానీ ఇందులో సుధీర్ చైల్డ్ లవ్ స్టోరీ మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. "నాది 5 వ తరగతిలో మొదలైన లవ్ స్టోరీ. ఫ్రెండ్స్ లింకులు పెడతారు కదా అలా మొదలయ్యింది. అలా 14 ఏళ్ళు మా మధ్య ప్రేమ నడిచింది. తాను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నేను అప్పటికి మ్యాజిక్ షోస్, ఈవెంట్స్ అవన్నీ చేసుకుంటున్నాను. నాకు ఒక విషయం తెలిసి ఇదేంటి అని ఆమెను అడిగాను.
నేను సంతోషంగా ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఆ టైములో నేను మ్యాజిక్ షో చేయాలి అందరినీ ఎంటర్టైన్ చేయాలి. 7.30 ఆ టైంలో గెస్టులు వస్తున్నారు. నేను నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్న, అరుస్తున్న పిచ్చిపిచ్చిగా ఉన్నా. ఎం చేస్తున్నానో నాకే తెలీదు. అదే టైంకి ఈవెంట్ వాళ్ళు కాల్ చేసి గెస్టులు వచ్చేస్తున్నారు ఎక్కడున్నారు అని కాల్ చేశారు. నేను వెళ్లి ఒక షో చేసాను. అదే నా లైఫ్ లో మర్చిపోలేని షో ఎందుకంటే 300 మంది ఆ షోకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
ఆ తర్వాత ప్రతీ సంవత్సరం ఆమె పుట్టిన రోజున ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించేవాడిని. రెండేళ్ల క్రితమే నాకు ఫస్ట్ టైం రిప్లై వచ్చింది థాంక్యూ సో మచ్ అని" చెప్పాడు సుధీర్. ఇక కో - హోస్ట్ గా వచ్చిన విష్ణు ప్రియా వెంటనే "ఆ రోజు అలా అయ్యి ఉండకపోతే ఈరోజు ఇంత సక్సెస్ ఫుల్ స్టార్ అయ్యి ఉండేవాడివి కాదేమో. నువ్వు కస్టపడి నీ ఫామిలీ మొత్తాన్ని అన్ని సెట్ చేసావ్ ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు. ఈ టాప్ పొజిషన్ లో ఉన్న కింగ్ కి అద్భుతమైన క్వీన్ రావాలి మేమంతా కోరుకుంటున్నాం." అని విష్ చేసింది.
![]() |
![]() |